వియత్నాంలో వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎఫ్‌టిసిసిఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్)లో జరిగింది. 11 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో సీనియర్ అధికారులు, టియన్ గియాంగ్, బిన్ దిన్, బా రియా వుంగ్ టౌ ప్రావిన్సులు మరియు హో చి మిన్ ప్రావిన్స్ చెందిన అధికారులు ఉన్నారు.
పదకొండు మంది సభ్యుల ప్రతినిధులలో వియాత్నం లోని భారత రాయబార కార్యాలయంలోని వాణిజ్య విభాగం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న మిస్టర్ బుయి అన్హ్ తువాన్ కూడా ఉన్నారు. వియత్నాం ప్రతినిధి బృందం IT, BT, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, హెల్త్‌కేర్ & ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టాలని కోరింది.
- Advertisement -