Vijay meets Prime Minister Modi: తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్.. అనంతరం ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని కలిశారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం వీరి భేటికి సంబంధించిన ఫొటోలను పీఎంవో ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది.
Also read: Minister Ponguleti: రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
மாண்புமிகு இந்தியப் பிரதமர் திரு. நரேந்திர மோடி அவர்களை இன்று (27.5.2026) புதுதில்லியில் உள்ள பிரதமர் அலுவலகத்தில், மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் மரியாதை நிமித்தமாக சந்தித்துப் பேசினார்.#CMJosephVijay pic.twitter.com/MlhPPpAxAI
— CMOTamilNadu (@CMOTamilnadu) May 27, 2026
శ్రీలంకలో అరెస్టైన తమిళ జాలర్లను విడిపించాలి..
ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మేకెదాటు డ్యామ్ వివాదం అంశంపైనా ప్రధానితో చర్చించినట్లు తెలిపింది. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడం వంటి ఘటనలపై పీఎం మోదీకి వివరించినట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 12 మంది తమిళ మత్స్యకారులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారని, ప్రస్తుతం 58 మంది మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అభ్యర్థించినట్లు పేర్కొంది. అదేవిధంగా, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాళ్తు’ (ప్రార్థనా గీతం) ఆలపించడానికి అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కాగా, తమిళనాడు సీఎం అయ్యాక విజయ్ తొలిసారి ప్రధానితో సమావేశమవ్వడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

