Vijay meets with AIDMK rebel MLAs: ఫలితాలు వెలువడ్డ నాటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్న తమిళనాట మరో కీలక పరిణామం జరిగింది. ఏఐడీఎంకే పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న 28 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని విజయ్‌కి మద్దతు పలికారు. దీంతో, రేపు అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు ముందే సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నట్లైంది. తద్వారా ఆయన బలం 147కు చేరుకుంది. ఇది మెజారిటీ మార్కును సులువుగా దాటేలా చేసింది. ఈ పరిణామంతో రేపటి ఫ్లోర్ టెస్ట్‌లో ఆయన గెలుపును దాదాపు ఖాయం అయనట్లేనని చెప్పవచ్చు.
Also Read: https://teluguprabha.net/top-stories/cm-vijay-sensational-decision/
చక్రం తిప్పిన విజయ్.. 147కి చేరిన బలం..
ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. చివరికి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీల సపోర్ట్‌తో విజయ్ బలం 120కి చేరింది. మే 13న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో మరో 28 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తామని చెప్పడంతో ఆయన బలం 147కి చేరింది. కాగా, విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టేందుకు అనేక అడ్డంకులొచ్చినా.. చివరకు చిన్న పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏఐడీఎంకే చీలికతో మరింత బలం చేకూరింది.

