Tamilnadu TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గెలిచిన TVK ఎమ్మెల్యేలంతా విజయ్‌ను తమ నాయకుడిగా ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో మహాబలిపురంలోని రిసార్ట్‌కు విజయ్ ఎమ్మెల్యేలను తరలించారు.
Also Read: https://teluguprabha.net/national-news/the-bjp-government-will-be-formed-in-west-bengal-on-may-9th/
కాగా, మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో, 108 స్థానాలను కైవసం చేసుకుని TVK అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ విజయంతో దళపతి విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. DMK, AIADMK వంటి ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి, తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
మరోవైపు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. DMK ఆఫీస్‌లో ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మీటింగ్‌కి హాజరు కాలేదు. వారంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్‌కు విజయ్ లేఖ రాశారు.

