రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా మరోవైపు ఓ ఆసక్తికరమైన కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న విజయేందర్ గుప్తాకు తాజాగా స్పీకర్ గా అవకాశం ఇచ్చింది బీజేపీ.
ఆరోగ్యకరమైన చర్చలు సాగేలా
గతంలో ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించారు. 10 ఏళ్ల క్రితం ఇదే ఢిల్లీ అసెంబ్లీ నుంచి విజయేందర్ గుప్తాను గెంటేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా (ఇప్పుడు ఈమె కాంగ్రెస్ లో ఉన్నారు)పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారంటూ విజయేందర్ ను అసెంబ్లీ నుంచి గెంటేశారు. అరడజను మంది మార్షల్స్ వచ్చిన ఆయను ఎత్తుకెళ్లారు కూడా. ఇప్పుడు అదే అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా కొత్త బాధ్యతలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన చర్చ సాగేలా తాను సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తానంటూ విజయేందర్ గుప్తా తాజాగా వ్యాఖ్యానించారు.