Tamilnadu Elections TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకు కాంగ్రెస్ మద్దతు కోరినట్లు తెలిపారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) గెలుపు చాలా గర్వంగా ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజయ్ సీఎం అవుతానని చాలా నమ్మకంతో ఉన్నారని.. ఈ విషయంలో ఒక్క శాతం కూడా తనకు డౌట్ లేదని స్పష్టం చేశారు. పొత్తులకు వెళ్లకుండా సింగిల్‌గా పోటీ చేసిన ఆధిక్య స్థానాల్లో విజయబావుటాఎగురవేస్తున్నారని కొనియాడారు. ఇది చారిత్రాత్మక విజయమని ప్రశంసించారు.
ఈ క్రమంలో టీవీకే అభ్యర్థులకు విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులతో సంప్రదింపులు జరిపిన అధిష్ఠానం వెంటనే చెన్నై రావాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే అడుగులు వేస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana/ktr-sensational-comments-against-revanth-reddy-government/
మరోవైపు టీవీకే ఆధిక్యంతో తమిళనాడులో ప్రజలు, అభిమానుల సంబరాలు హోరెత్తుతున్నాయి. విజయ్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ, పార్టీ గుర్తు విజిల్ వేస్తూ సంబరాలు జరుపుకొంటున్నారు. ఇక విజయ్ ఇంట్లో హడావుడి అంతా ఇంతా కాదు. కుటుంబీకులు విజిల్స్ వేస్తూ, డ్యాన్సులు వేస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. కాగా, నటి త్రిష కాసేపటి క్రితం విజయ్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటన్నర సేపు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

