ఓవైపు చంటి బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే మరోవైపు ఆఫీసు పనులు చేసుకుంటున్న వుమెన్ సీఈవో పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. చంటి బిడ్డను ఆఫీసుకే తీసుకువచ్చి తల్లిగా, సీఈవోగా ఆమె బిజీగా గడపటంపై కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ అయిన రాధికా గుప్త తల్లిగా, సీఈవో తాను చేస్తున్న ప్రయాణం గురించి ట్విట్టర్ లో స్టోరీ పోస్ట్ చేశారు. తన డెస్క్ పక్కనే ఆమె కుమారుడు బొమ్మలతో ఆడుకునే ఫోటోను ఆమె ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆఫీసు పనుల్లో తలమునకలై ఉండగా, ఎవరూ సాయం చేసేందుకు లేకపోతే ఆఫీసుకు తమ వెంట ఎవరు వస్తారో గెస్ చేయమని ఆమె పోస్ట్ చేశారు. ఆడవారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను రాధిక పోస్ట్ చేసిన ఒక్క పోస్ట్ తో వివరించినట్టైందని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. సీఈవో కాబట్టి రాధికకు బిడ్డను ఆఫీసుకు తెచ్చుకునేంత అవకాశం దక్కిందని కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఊహించండి అంటూ నెటిజన్లు చాలామంది ట్వీట్ చేస్తున్నారు.