Sunday, July 7, 2024
Homeనేషనల్Viral: సెక్స్ లేదా షారూఖ్ ఖాన్ ..సేల్ అయ్యేది ఇదే !

Viral: సెక్స్ లేదా షారూఖ్ ఖాన్ ..సేల్ అయ్యేది ఇదే !

“మోస్ట్ సేలబుల్ ఐటెం ఏంటంటే సెక్స్ లేదా షారూఖ్ ఖాన్ అంతే”.. ఈ విషయాన్ని 20 ఏళ్ల క్రితం నేహా ధూపియా చెప్పినప్పుడు చాలా మంది నమ్మలేదు కానీ 20 ఏళ్ల తరువాత కూడా ఈ విషయం నిజమని నిరూపితమైందంటూ ఓ నెటిజన్ గుర్తు చేస్తుండటం వైరల్ గా మారింది. పఠాన్ బాక్సాఫీస్ వసూళ్ల సునామీ నేపథ్యంలో నేహా ధూపియా ఓల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సందడి చేసేస్తున్నాయి. దీనిపై స్పందించిన హీరోయిన్, యాంకర్, మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా.. ఇది యాక్టర్ కెరీర్ కాదు కానీ కింగ్ హయాం అంటూ కింగ్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె రియాక్ట్ అయ్యారు.

- Advertisement -

2004లో తన సినిమా జూలీ రిలీజ్ టైంలో నేహా ధూపియా ..ఈమధ్య కాలంలో అమ్ముడుబోయేది సెక్స్ లేదా షారూఖ్ ఖాన్ మాత్రమే అంటూ జోస్యం చెప్పారు.

ఇక షారూఖ్ లేటెస్ట్ రిలీజ్ 542 కోట్ల రూపాయల గ్రాస్ వల్డ్ వైడ్ కలెక్ట్ కావటంతో 5వ రోజు పఠాన్ జోరు ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News