Supreme Court CJI: దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక సూచనలు చేశారు. కేసుల విచారణ ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రస్తుతం అనుసరిస్తున్న ఆధునిక విధానాలనే హైకోర్టులు సైతం పాటించాలని ఆదేశించారు.
సోమ, శుక్రవారాల్లో వర్చువల్ విచారణలు: సుప్రీంకోర్టు సీజేఐ ఆదేశాల ప్రకారం హైకోర్టుల్లో సోమ, శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్ విధానం) ద్వారానే విచారణలు జరపాలని సీజేఐ సూచించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈరోజు విచారణ సందర్భంగా సీజేఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ అంశంపై తాము ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. గత శుక్రవారమే అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలకు ఈ మేరకు అవసరమైన సూచనలు జారీ చేశామని వెల్లడించారు.
Also read-BCCI : బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ
సాంకేతికతకు ప్రాధాన్యం: సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లు సైతం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలు చేపట్టాయి. న్యాయవ్యవస్థలో సాంకేతికతను పెంపొందించడం, దూరప్రాంతాల న్యాయవాదులు, పిటిషనర్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఈ వర్చువల్ విచారణల విధానాన్ని హైకోర్టుల్లోనూ ప్రోత్సహిస్తోంది.

