Sunday, April 6, 2025
Homeనేషనల్బీజేపీ తదుపరి టార్గెట్ క్రైస్తవులే.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

బీజేపీ తదుపరి టార్గెట్ క్రైస్తవులే.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

వక్ఫ్ సవరణ బిల్లు 2025పై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, ప్రతిపక్షాలు దీన్ని ముస్లిం హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ‘‘వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేశారని విమర్శించారు. ఇక తదుపరి టార్గెట్ క్రైస్తవులు. ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిల భూస్వామ్యాన్ని ప్రస్తావించడం మూమూలు విషయం కాదని.. అది ఓ సంకేతాత్మక హెచ్చరిక అంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

- Advertisement -

ఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వ్యాసంలో.. కాథలిక్ భూములు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూమిని కలిగి ఉన్నట్లు పేర్కొనడం, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వలస పాలన సమయంలో లీజుకు తీసుకున్న భూములను చర్చి ఆస్తిగా గుర్తించరన్న కేంద్ర ఉత్తర్వులు కూడా పేర్కొనడం ఉద్దేశపూర్వకమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ తీవ్ర ఆక్షేపాలు వ్యక్తం చేస్తోంది. ముస్లింల ఆస్తులపై ప్రభుత్వ హస్తక్షేపానికి ఇది నిదర్శనమని, తదుపరి అదే విధంగా ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC) మాత్రం వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపింది. ఇది రాజకీయంగా ఒక కొత్త కోణాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. ముస్లిం సంఘాల మద్దతు కోల్పోతున్న బీజేపీ, ఇప్పుడు క్రైస్తవ వర్గాలకు దగ్గరవ్వాలనే ప్రయత్నంలో ఉందా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెసుతో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారని వారు పేర్కొన్నారు. రాజకీయంగా.. ఈ అంశం మత సామరస్యాన్ని ప్రభావితం చేసేలా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కేంద్రం ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News