Friday, November 22, 2024
Homeనేషనల్Rahul Bharat Jodo Yatra: రాజ‌స్థాన్‌లో అడుగిడ‌నున్న రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌.. కాంగ్రెస్‌లో ప్లెక్సీల‌...

Rahul Bharat Jodo Yatra: రాజ‌స్థాన్‌లో అడుగిడ‌నున్న రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌.. కాంగ్రెస్‌లో ప్లెక్సీల‌ వార్ ..

Rahul Bharat Jodo Yatra: రాజ‌స్థాన్ కాంగ్రెస్ పార్టీలో గెహ్లాట్‌, సచిన్ వ‌ర్గీయుల మధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. గ‌త కొంత‌కాలంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. రాజ‌స్థాన్ పీసీసీ చీఫ్‌, సీఎం అశోక్ గెహ్లాట్, ఆ పార్టీ నేత స‌చిన్ పైలెట్ వ‌ర్గీయుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల.. రాజ‌స్థాన్ సీఎం పీఠంకోసం వీరి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగిన విష‌యం విధిత‌మే. అయితే, తాజాగా రాహుల్ గాంధీ చేప‌ట్టే భార‌త్ జోడో యాత్ర‌లో వీరిద్ద‌రూ క‌లిసి పాల్గొన్నారు. సోమ‌వారం సాయంత్రం నుంచి రాజ‌స్థాన్ రాష్ట్రంలో భార‌త్ జోడో యాత్ర సాగ‌నుంది. ఈ క్ర‌మంలో పైలెట్‌, గెహ్లాట్‌ల మ‌ధ్య స‌యోధ్యకుదుర్చారు. అయినా మ‌ళ్లీ వారి వ‌ర్గీయుల మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది.

- Advertisement -

దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడోయాత్ర‌తో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం విధిత‌మే. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశంలో విభ‌జ‌న రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని, అందుకు వ్య‌తిరేకంగా దేశ‌ప్ర‌జలంద‌రినీ ఏకం చేసేందుకు ఈ పాద‌యాత్ర చేస్తున్న‌ట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్ప‌టికే ఈ యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కొన‌సాగింది. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం సాయంత్రం రాజ‌స్థాన్ రాష్ట్రంలోకి ప్ర‌వేశిస్తుంది. సోమ‌వారం ఉద‌యం నుంచి ఆ రాష్ట్రంలో యాత్ర కొన‌సాగుతోంది.

రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు కాంగ్రెస్ పార్టీ నేత‌లు భారీ ఎత్తున ప్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల ఏర్పాటులో గెహ్లాట్‌, పైలెట్ వ‌ర్గీయుల మ‌ధ్య వివాదం రాజుకుంది. రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌ తీరుకు వ్యతిరేకంగా సచిన్‌ పైలట్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోస్టర్ల కోసం తాము ఎంతో ఖర్చుపెట్టి కీలక ప్రాంతాల్లోని హోర్డింగులను అద్దెకు తీసుకున్నామని, ఇప్పుడు తమ పోస్టర్లపై ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా పీసీసీ చీఫ్‌ పోస్టర్లు వేయడం ఏంటని పైలట్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌గాంధీ రాకకు కొన్ని గంటల ముందు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ లుకలుకలు బయటపడటం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News