Sunday, November 16, 2025
Homeనేషనల్war of words: మోడీ ముందు కుక్కలా వణికే సీఎం, నీకు ప్రజలే బుద్ధి చెబుతారు

war of words: మోడీ ముందు కుక్కలా వణికే సీఎం, నీకు ప్రజలే బుద్ధి చెబుతారు

ప్రధాని నరేంద్ర మోడీ ముందు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై కుక్కలా వణికిపోతారంటూ సెన్సేషనల్ కామెంట్సే చేశారు మాజీ సీఎం సిద్ధరామయ్య. సిద్ధూ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయిన బొమ్మై.. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. తనను ‘పప్పీ’తో పోల్చటం చూస్తుంటే ఇది కాంగ్రెస్ నేత వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతోందని బొమ్మై మండిపడ్డారు. కుక్క అంటేనే చాలా విశ్వాసపాత్రమైన జంతువు, తన ఉద్యోగం అది విశ్వాసంతో చేస్తుంది, ప్రజల పట్ల తాను కూడా అంతే విశ్వాసంగా ఉంటానని .. సిద్దూ మాటలను బొమ్మై తిప్పికొట్టారు. సిద్ధూ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి మోస్ట్ పొలైట్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందు కనీసం నిలబడలేక భయంతో ఉండేవారని బొమ్మై ప్రత్యారోపణలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad