మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో లంక చేరుకున్న మోడీకి కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఘన స్వాగతం పలికారు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగం అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై అధ్యక్షుడు దిసానాయకేతో మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు.

రెండేళ్ల క్రితం శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన సమయంలో భారత్ అండగా నిలిచింది. తాజాగా మోడీ పర్యటనతో శ్రీలంకకు మరింత అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్‌టెక్ శిఖరాగ్ర ససమావేశానికి మోడీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ పర్యటన అనంతరం అక్కడ నుంచి నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు.