కేంద్ర హోంశాఖ సహాయమంత్రికే రక్షణ లేకుండా పోయిందంటే ఇక సామాన్యుల సంగతేం చెప్పాలి అన్నట్టు తయారైంది. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. తృణముల్ కాంగ్రెస్ మద్దతుదారులు ఈ దాడిలో పాల్గొన్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న ఎస్ యు వీ కారు విండ్షీల్డ్ పగిలిపోయింది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. కూచ్ బిహార్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేంద్ర మంత్రి ప్రమాణిక్.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు అనవసరంగా ఓ గిరిజనుడిని పొట్టనపెట్టుకోవటంపై వీరంతా ఆందోళనకు దిగి, మంత్రిపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. గిరిజనుడి మృతికి కారణం కేంద్ర ప్రభుత్వం స్థానిక బీజేపీ నేత ప్రమాణిక్ అంటూ గత కొన్ని రోజులుగా టీఎంసీ పదేపదే ఊదరగొడుతూ, జనాన్ని రెచ్చగొడుతోంది.