West Bengal results: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో కమలం జోరు కనిపిస్తుంది. దీంతో గత దశాబ్ద కాలంగా బెంగాల్ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు కోలుకేని దెబ్బతగిలింది. సెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) అంచనాలకు మించి దూసుకుపోతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బెంగాల్ గడ్డపై కమలం వికసించే దిశగా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దీంతో దీదీ కోటకు బీటలు పడేట్లు కనిపిస్తుంది.
హోరాహోరీ పోరులో బీజేపీ ఆధిక్యం: మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 కాగా.. తాజా సమాచారం ప్రకారం బీజేపీ ఏకంగా 170కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ వంటి కీలక నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.
టీఎంసీకి ఎదురుదెబ్బ: గత ఎన్నికలతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్ గణనీయంగా స్థానాలను కోల్పోతోంది. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ పట్టున్న డైమండ్ హార్బర్ వంటి స్థానాల్లోనూ ప్రతిపక్షాలు గట్టి పోటీనిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నారని ట్రెండ్స్‌ను చూస్తే అర్థం అవుతుంది. అందుకే అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

