Vice President Election: భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి ప్రత్యేక స్థానం ఉంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించడం తో పాటు, రాష్ట్రపతి హాజరు లేకపోతే లేదా ఆ పదవి ఖాళీగా ఉంటే, తాత్కాలికంగా రాష్ట్రపతి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగంలోని 63వ, 64వ, 65వ, 66వ అధికరణలతోపాటు 1952లోని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం జరుగుతుంది.
ఎన్నికల నిర్వహణ
ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ బాధ్యతను భారత ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్వహిస్తుంది. ఎన్నికలు సంయుక్త రహస్య ఓటింగ్ (Single Transferable Vote) ద్వారా జరుగుతాయి.
ఎన్నిక్టరోల్ కాలేజ్ (Electoral College)
రాష్ట్రపతి ఎన్నికలకు భిన్నంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభలలో సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియలో భాగం కారు.
అయితే ప్రస్తుతం లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. అంటే 788 మంది సభ్యులకుగాను 781 మంది సభ్యులున్నారు.
వీరిలో మెజార్టీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే (ఎవరికి ఓటేస్తే )వారే ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
ఓటింగ్ విధానం
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాలి. అంటే, అభ్యర్థులను 1, 2, 3..ఇలా ప్రాధాన్యత క్రమంలో సూచించాలి.
ఎవరైనా అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందితే, ఆయనే విజేత. లేకపోతే, కనీస ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి, అతనికి వచ్చిన ఓట్లను రెండవ ప్రాధాన్యత ప్రకారం మిగతావారికి బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ ఒకరు మెజారిటీ పొందే వరకు కొనసాగుతుంది. ఈసారి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారు. అది కూడా అధికారంలో ఉన్న ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండి కూటమి తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిలు బరిలో ఉన్నారు.
పదవీకాలం, అర్హతలు
ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు.
అర్హతలు:
భారత పౌరుడు కావాలి.
కనీసం 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి.
లాభాపేక్ష కలిగిన పదవిలో ఉండకూడదు (కొన్ని మినహాయింపులు ఉన్నాయి).
పదవి ఖాళీ అయ్యే పరిస్థితులు
రాజీనామా, పదవీకాలం ముగియడం, అర్హత కోల్పోవడం , మరణం వంటి పరిస్థితుల వల్ల పదవికి ఖాళీ ఏర్పడుంది. ఈ సందర్భాలలో, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక 6 నెలల్లోపు నిర్వహించాలి.
ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార ఎన్డీయేకు 425 మంది సభ్యులు, ప్రతిపక్ష ఇండియా కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది. ఈ రెండు పక్షాలలో సభ్యులుగా లేనివారు ఎవరికి ఓటేస్తారో ఆసక్తిగా మారింది.


