winters in india: దేశంలోని పలు రాష్ట్రాలకు చలిగాలుల ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ హరియాణా, ఉత్తర రాజస్థాన్‌లకు వచ్చేవారం నాలుగు రోజులపాటు చలిగాలుల ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్రం హెచ్చరించింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీల వరకు తగ్గిపోతాయని ఐఎండీ తెలిపింది. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నాలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ తక్కువగా ఉంటే, మిగతా రాష్ట్రాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో చలిగాలులు పెరగడంతోపాటు, పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
పంజాబ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ బంగాళాఖాతం తీర ప్రాంతాలు, అండమాన్ ప్రాంతంలో కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఆయా రాష్ట్రాలు వాతావరణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. చలి, పొగమంచు ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి.