Saturday, November 15, 2025
HomeTop StoriesNepo Kids: మనీశ్ 'నెపో కిడ్స్' ట్వీట్‌పై బీజేపీ విమర్శ.. 'కొంచెం ఎదగండి' అని కాంగ్రెస్...

Nepo Kids: మనీశ్ ‘నెపో కిడ్స్’ ట్వీట్‌పై బీజేపీ విమర్శ.. ‘కొంచెం ఎదగండి’ అని కాంగ్రెస్ కౌంటర్

Congress MP On Row Over ‘Nepo Kids’ Post: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీష్ తివారీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో ప్రభుత్వాలు మారడం గురించి, ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న నిరసనల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. తివారీ తన పోస్ట్‌లో రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘నెపో కిడ్స్’ (వారసత్వ రాజకీయ నాయకులు) అని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మనీష్ తివారీ ఘాటుగా స్పందించారు. “ప్రతి విషయాన్ని కాంగ్రెస్-బీజేపీకి ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదు. కొందరు జీవితంలో ఎదిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను,” అని ఘాటుగా బదులిచ్చారు.

 

- Advertisement -

పలు దేశాల్లో ‘వారసత్వ పాలన’కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై మనీష్ తివారీ ఒక పోస్ట్ పెట్టారు. “శ్రీలంకలో అధ్యక్షులు గొటబయ రాజపక్ష పదవి నుంచి తప్పుకోవడం, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోవడం, నేపాల్‌లో కేపీ శర్మ ఓలి నిష్క్రమించడం, ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువతరం ఇకపై వారసత్వ పాలనను అంగీకరించడం లేదు,” అని తివారీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వియా వెంటనే స్పందిస్తూ, తివారీ వ్యాఖ్యలు రాహుల్ గాంధీని ఉద్దేశించినవేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో ‘అల్టిమేట్ నెపో కిడ్’ అని మాల్వియా ఎద్దేవా చేశారు.

ALSO READ: Tax evasion: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై దాడులు

దీనికి కౌంటర్‌గా మనీష్ తివారీ, “సౌత్ ఆసియా, ఈస్ట్ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి,” అని ట్వీట్ చేశారు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంటులో చర్చ సందర్భంగా తివారీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా “నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వారు నా మాటలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు,” అని వ్యాఖ్యానించారు. ఈ తాజా వివాదం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Siddaramaiah’s Letter to Azim Premji : బెంగళూరు ట్రాఫిక్ కు చెక్ పెట్టే ప్లాన్ లో సీఎం సిద్ధరామయ్య.. విప్రో క్యాంపస్ పై ఫోకస్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad