Saturday, October 5, 2024
Homeనేషనల్Unique Baby: నాలుగు కాళ్లతో జన్మించిన పాప.. ఎక్కడంటే?

Unique Baby: నాలుగు కాళ్లతో జన్మించిన పాప.. ఎక్కడంటే?

- Advertisement -

Unique Baby: అవిభక్త కవలలు, వింత శిశువులు, కళ్ళు.. చేతులకు అదనపు వేళ్ళతో పుట్టిన శిశువులు.. ఇలా ఎన్నో చూసే ఉంటారు. అయితే.. నాలుగు కాళ్లతో పుట్టిన శిశువులు చాలా అరుదు. అలాంటి ఘటనే ఇది. ఓ చిన్నారి నాలుగు కాళ్లతో జన్మించింది. దాంతో ఈ సంఘటన కాస్త స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌ గ్వాలియార్‌లో చోటు చేసుకుంది.

సికందర్‌ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ స్థానికంగా ఉన్న కమల రాజా ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యంగా ఆ చిన్నారికి నాలుగు కాళ్లు ఉన్నాయి. దాంతో ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. వైద్య సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అయితే చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు శిశువుకు ఇంకా ఏమైనా ఇతర వైకల్యం ఉందా అనే అనుమానంతో పరీక్షిస్తున్నా రు.

పాప బరువు 2.3కిలోగ్రాములు ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు.. దీనిని వైద్య భాషలో ఇస్కియోపాగస్ (ischiopagus) అంటారని తెలిపారు. గర్భ ధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయని.. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుందని.. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయని, ఈ పాప విషయంలో కూడా అలాగే జరిగి నాలుగు కాళ్లతో పుట్టిందని తెలిపారు. పరీక్షల తర్వాత బిడ్డ ఆరోగ్యంగా ఉంటే.. ఆపరేషన్ చేసి అదనపు రెండు కాళ్లను తొలగిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News