Sunday, November 16, 2025
Homeనేషనల్Woman Techie: లవర్‌పై కోపంతో స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌.. బెంగళూరు పోలీసుల అదుపులో మహిళా టెక్కీ

Woman Techie: లవర్‌పై కోపంతో స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌.. బెంగళూరు పోలీసుల అదుపులో మహిళా టెక్కీ

Woman Techie Threatens Fake Bomb Mails: ప్రియుడు తన ఇష్టాలను నిరాకరించడంతో అతనిపై పగ తీర్చుకునేందుకు యత్నించింది ఓ మహిళా టెక్కీ.. తనకున్న టెక్నికల్‌ స్కిల్స్‌ను దుర్వినియోగం చేస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని స్కూల్స్‌, పబ్లిక్‌ ప్లేసెస్‌కు బెదిరింపు ఈ మెయిల్స్‌ పంపింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. గత కొంతకాలంగా ఫేక్‌ బాంబ్‌ మెయిల్స్‌ వెనుక ఉన్న ఆగంతకురాలు ఈమెనే అని పోలీసులు గుర్తించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/rahul-gandhi-vs-ec-25-lakhs-votes-theft-in-haryana-elections/

ఇటీవల బెంగళూరులోని పలు పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌కు సంబంధించి గుజరాత్‌లో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రెనే జోషిల్డాగాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.  నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఇప్పటికే రెనేపై కేసులు నమోదయ్యాయి. విచారణలో బెంగళూరులోని దాదాపు 7 పాఠశాలలకు పంపిన బాంబు బెదిరింపు ఈమెయిల్‌లతో మహిళకు సంబంధం ఉందని తెలిసింది.

అయితే ఒక్క కర్ణాటకలోనే కాకుండా చెన్నై, హైదరాబాద్, గుజరాత్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలకు కూడా ఆమె బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపిందని పోలీసులు గుర్తించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు సైతం నకిలీ మెయిల్‌లను పంపినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: https://teluguprabha.net/national-news/anil-ambani-ed-notice-to-bank-fraud-money-laundering/

తాజాగా ఆమెను బాడీ వారెంట్‌పై బెంగళూరుకు తీసుకువచ్చారు. కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిర్వహించిన పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెనే జోషిల్డా.. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ని ఉపయోగించి.. తన లొకేషన్‌, గుర్తింపును దాచిపెట్టిందని పోలీసులు గుర్తించారు. గేట్‌ కోడ్‌ అప్లికేషన్‌ సాయంతో బహుళ ఖాతాలను, వర్చువల్ మొబైల్ నంబర్‌లను సంపాదించింది. దాదాపు 7 వాట్సాప్ ఖాతాలను కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది.

దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో రెనే జోషిల్డాపై కేసులు నమోదయ్యాయి. పలు కోణాల్లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మహిళా టెక్కీ.. ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడటానికి కారణంగా తన ప్రేమికుడిపై ఉన్న కోపమే అనే విచారణలో వెల్లడైంది. తన ప్రియుడు తన ఇష్టాయిష్టాలను తిరస్కరించడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad