ప్రస్తుతం మద్యం సేవించడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు మగవారు మాత్రమే తాగేవారు. ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు. కొంతమంది లిక్కర్ తాగడం స్టేటస్ సింబల్‌గా భావిస్తూంటారు. దీంతో మహిళలు కూడా తాగడంలో వెనుకాడటం లేదు. పురుషులతో పోటీపడి మరీ కిక్‌లో ఊగుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ(Union Ministry of Health and Family Welfare) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహిళలు మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రమైన అస్సాం(Assam) తొలి స్థానంలో ఉంది.
ఇక ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉండటం గమనార్హం. అస్సాం తర్వాత మేఘాలయ(Meghalaya), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయసున్న మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతంగా ఉంటే.. అస్సాంలో 16.5 శాతం, మేఘాలయలో 8.7 శాతంగా ఉందని సర్వేలో వెల్లడైంది.