Homeనేషనల్World Bee Day-2026: ఘనంగా ప్రపంచ తేనెటీగల దినోత్సవం వేడుకలు

World Bee Day-2026: ఘనంగా ప్రపంచ తేనెటీగల దినోత్సవం వేడుకలు

World Bee Day 2026 celebrated: వనరుల సముచిత వినియోగం కోసం పొదుపును పాటించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో.. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (KVIC) ‘ప్రపంచ తేనెటీగల దినోత్సవం – 2026’ను వర్చువల్ విధానంలో నిర్వహించింది. దిల్లీలోని గాంధీ దర్శన్ కార్యాలయం నుండి కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూణేలోని సెంట్రల్ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CBRTI) లో ఏర్పాటు చేసిన తేనె ప్రదర్శనను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఏడాది ప్రపంచ తేనెటీగల దినోత్సవ ఇతివృత్తం (Theme) “ప్రజలు మరియు గ్రహం కోసం తేనెటీగలతో కలిసికట్టుగా ఉందాం” అనే అంశానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు జరిగాయి.

- Advertisement -

వర్చువల్ నిర్వహణతో ఇంధన పొదుపు: ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా అనవసర ప్రయాణ ఖర్చులు, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఈసారి కార్యక్రమాన్ని పూర్తిగా వర్చువల్‌గా నిర్వహించినట్లు చైర్మన్ మనోజ్ కుమార్ తెలిపారు. దీనివల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తేనెటీగల పెంపకందారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం కలిగిందన్నారు. “శ్వేత విప్లవాన్ని మధుర విప్లవంగా (స్వీట్ రివల్యూషన్) మార్చాలన్న ప్రధాని సంకల్పం గ్రామాల్లో స్వయం ఉపాధిని వేగవంతం చేసింది” అని ఆయన పేర్కొన్నారు.

హనీ మిషన్ సాధించిన మైలురాళ్లు: 2017లో ప్రారంభమైన ‘హనీ మిషన్’ ద్వారా దేశంలో సాధించిన ప్రగతిని చైర్మన్ గణాంకాలతో వివరించారు. 2017-18 నుండి 2025-26 మధ్య సాధించిన అభివృద్ధిని చైర్మన్ మనోజ్ కుమార్ తెలిపారు. పంపిణీ చేసిన తేనెటీగల పెట్టెలు 2,46,099 కాగా.. మొత్తం తేనె ఉత్పత్తి 24,269 మెట్రిక్ టన్నులని పేర్కొన్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ తేనె: భారతదేశం నుండి నాణ్యమైన తేనె అమెరికా, కెనడా, యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఒమన్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణ కొరియా వంటి దేశాలకు భారీగా ఎగుమతి అవుతోందని చైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు. ఇది భారతీయ తేనెకు ఉన్న ప్రపంచవ్యాప్త ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి మధుర విప్లవం: తేనెటీగల పెంపకాన్ని కేవలం ఆదాయ వనరుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, వ్యవసాయ వృద్ధికి ఒక సాధనంగా చూడాలని మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కలలుగన్న మధుర విప్లవాన్ని.. దేశంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా దేశంలోని పలు ప్రాంతాల ప్రతినిధులు, లబ్ధిదారులు తమ విజయగాథలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కేవీఐసీ సంయుక్త ముఖ్య కార్యనిర్వహణాధికారి, అధికారులు, ఖాదీ సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు మరియు శిక్షణార్థులు పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో కేవీఐసీ పాత్రను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News