Wednesday, April 2, 2025
Homeనేషనల్Zomato: 500 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో

Zomato: 500 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిలో చాలామంది పనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాల వల్ల నోటీసు పీరియడ్ లేకుండానే తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఒక నెల వేతనాన్ని పరిహారంగా చెల్లించినట్లు సమాచారం. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం ద్వారా ఏడాది క్రితం సుమారు 1,500 మందిని కస్టమర్ సపోర్ట్ విభాగంలో నియమించింది.

- Advertisement -

నియామకాలు చేపట్టిన ఏడాదిలోపే ఈ తొలగింపులు చోటు చేసుకోవడం గమనార్హం. ఉద్యోగుల తొలగింపుపై యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా కస్టమర్ సపోర్ట్ విధానాలను ఆటోమేట్ చేయడంతోపాటు, వ్యయాలను తగ్గించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- AI వినియోగించాలని జొమాటో యోచిస్తోంది. ఈ క్రమంలోనే 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News