Friday, September 20, 2024
HomeNewsKurnool: 'ఆడుదాం ఆంధ్రా'కు గ్రౌండ్స్ కావలెను

Kurnool: ‘ఆడుదాం ఆంధ్రా’కు గ్రౌండ్స్ కావలెను

అక్టోబర్ లో ఆడుదాం ఆంధ్ర నిర్వహించే ఛాన్స్

‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల నిర్వహణకు అనువైన క్రీడా మైదానాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆడుదాం ఆంధ్రాపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ధృడ సంకల్పంతో ఆడుదాం ఆంధ్రా ద్వారా 2.99 లక్షల మ్యాచులు, 40 లక్షల మంది క్రీడాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడలను గ్రామ/వార్డు సచివాలయం, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయి ల్లో ఐదు విభాగాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల నిర్వహణకు గాను 5 రకాల క్రీడలు ఎంపిక చేయడం జరిగిందని, ఈ ఐదు క్రీడలు క్రికెట్ (స్త్రీ, పురుషులు), వాలీ బాల్ (స్త్రీ, పురుషులు), కబడ్డీ (స్త్రీ, పురుషులు), కోకో (స్త్రీ, పురుషులు), బ్యాట్మెంటన్ డబుల్స్ (స్త్రీ, పురుషులు) లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రీడలలో పాల్గొనాలనే యువత 17 సంవత్సరాలు పైబడి ఉండాలన్నారు. పట్టణాల్లో చదివే విద్యార్థులైన కూడా వచ్చి వారి సచివాలయ పరిధిలో నిర్వహించే క్రీడల్లో పాల్గొనవచ్చు అన్నారు. ఈ క్రీడల్లో నియోజికవర్గాల వారీగా గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.20వేలు, రెండవ బహుమతి రూ.10వేలు, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి రూ.లక్ష, రెండవ బహుమతి రూ.50వేలు, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి రూ.5లక్షలు, రెండవ బహుమతి రూ.3లక్షలు అందజేస్తామన్నారు. ఈ క్రీడలను 46 రోజుల వరకు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అక్టోబర్ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందన్నారు. క్రీడల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జూలై 15వ తేది నాటికి సచివాలయాల వారీగా ఉన్న వారిని మ్యాపింగ్ చేయడంతో పాటు జిల్లాలో ఉన్న కళాశాల, పాఠశాలల్లో మైదానాలు, ఖాళీ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సెట్కూరు సీఈఓ పి.రమణ, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News