GST Bachat Utsav: దేశంలో వ్యాట్ విధానాన్ని తీసేసి జీఎస్టీ అంటూ కొత్త వస్తుసేవల పన్నులను తీసుకొచ్చింది మోదీ సర్కార్. అయితే మెుదటి నుంచి ప్రతిపక్షాలు దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడుతుందని వాదిస్తూ వస్తూనే ఉన్నాయి. అవన్నీ పెడచెవిన పెట్టిన మోదీ సర్కార్.. తీరా యవ్వారం బెడిసికొట్టేసరికి, ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేసేందుకు తప్పని పరిస్థితుల్లో జీఎస్టీ రేట్ల తగ్గింపు అంటూ చేసిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు తెచ్చినప్పటికీ దేశంలో వినియోగం పెరగకపోవటంతో చివరి అస్త్రంగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గింపులకు వచ్చారు. ఇలా అయినా స్టాక్ మార్కెట్లు ఆకర్షనీయంగా మారతాయి.. కంపెనీల ఆదాయాలు పెరుగుతాయని, దేశంలో వినియోగం, కొనుగోళ్లను తగ్గించిన రేట్లు పెంచుతాయని భావిస్తున్నారు.
నవరాత్రి కానుకగా దేశంలోని కోట్ల మంది ప్రజలు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఫోన్ల నుంచి కార్ల వరకు తమకు నచ్చిన వస్తువులను తగ్గించిన పన్ను రేట్లకు కొనుగోలు చేసేందుకు జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభం అయ్యింది. దేశంలో వస్తుసేవలకు డిమాండ్ పెంచటమే ప్రస్తుతం ఈ సంస్కరణ లక్ష్యంగా ఉంది. మరోపక్క అమెరికా వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్లో రక్షణాత్మక చర్యలకు దిగటంతో దేశీయంగా తగ్గించిన రేట్ల దోహదపడతాయని మోదీ సర్కార్ భావిస్తోది. పైగా పేద మధ్యతరగతి ప్రజలు కూడా లబ్ధిపొందుతారని తెలుస్తోంది.
మెుత్తానికి దేశయంగా కంపెనీలకు అమ్మకాల జోరు ఆదాయాలు, లాభాల పెంపును అందించి ప్రపంచ వేధికపై మరోసారి భారత స్టాక్ మార్కెట్లను ఆకర్షనీయంగా మార్చటంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని లక్ష్యంగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు కూడా దీనికి సహకారం అందించి స్థానిక వస్తువులనే కొనాలని మోదీ పిలుపునిచ్చారు. మెుత్తం మీద పన్ను తగ్గింపుల నుంచి జీఎస్టీ రిలీఫ్ వరకు దేశ ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేస్తుందని చెప్పుకొచ్చారు మోదీ. దీంతో మెుత్తానికి మందులు, ఇన్సూరెన్స్, ఫుడ్ ఐటమ్స్, ఆటో మెుబైల్స్ వంటి అన్ని వస్తువుల రేట్లు తగ్గింపులను చూడనున్నాయి. కంపెనీలు కూడా తగ్గించిన రేట్లను కస్టమర్లకు పాస్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నాయి.


