చైనాలో పురుడు పోసుకున్న నూతన వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూరో వైరస్). ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. బెంగుళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో 8 నెలల పసికందు కి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది.ఈ వార్త వినగానే యావత్ దేశం ఒకసారి ఉలిక్కిపడింది.కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై స్పందిస్తూ ఎవరు ఎలాంటి భయాందోళనకు గురవొద్దు అని ప్రస్తుత పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ఈ నూతన వైరస్ రకం గురించి వైద్యుల దగ్గర పూర్తిస్థాయి సమాచారం లేనందున దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది . డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నవజాత శిశువుకి శ్వాస సంబంధిత చికిత్స ఇవ్వడంపై వైద్యులు నిమగ్నమయ్యారు
ఈ నూతన వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనా వైరస్ గురించి ఎటువంటి సమాచారం ప్రపంచ దేశాలకు తెలియనివ్వడం లేదు.దీని పై డబ్ల్యూహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే చైనాలో లక్షల మంది పిల్లలు 14 ఏళ్ల లోపు వారు ఈ వ్యాధి బారిన పడ్డారు. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల శ్వాస సంబంధిత ఆరోగ్య రుగ్మతలు తో అవస్థ పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.