Saturday, November 23, 2024
HomeNewsబాబోయ్ నన్ను వదిలేయండి ప్లీజ్ - అనసూయ ఆవేదన

బాబోయ్ నన్ను వదిలేయండి ప్లీజ్ – అనసూయ ఆవేదన

- Advertisement -

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ..సోషల్ మీడియా వేదికగా మరోసారి నెటిజన్లకు రిక్వెస్ట్ చేసింది. జబర్దస్త్ షో తో ఎంతో పాపులార్టీ తెచ్చుకున్న ఈ భామ.. ఇద్దరు బిడ్డలకు తల్లయినప్పటికీ అందంలో మాత్రం హీరోయిన్స్ కూడా ఈమె ముందు తక్కువే..అనే రేంజ్లో అమ్మడు గ్లామర్ మెంటైన్ చేస్తుంది.

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన నాగ మూవీ లో చిన్న రోల్ చేసిన ఈమె..చాల ఏళ్ల తర్వాత జబర్డస్త్ షో తో బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ షో లో అందాల ఆరబోత తో యావత్ యూత్ ను కట్టిపడేసింది. ఆలా జబర్దస్త్ షో ద్వారా వెండితెర కు ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి. సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం లో మూవీ రంగమ్మత్తగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరైంది. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ , ఇటు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ , అలాగే సోషల్ ఇష్యూస్ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

మొదటి నుండి ఈమె ఎందుకు విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేస్తూ వచ్చింది. అర్జున్ రెడ్డి మొదలు , త్వరలో విడుదల కాబోతున్న ఖుషి వరకు అనేక వివాదస్పద కామెంట్స్ చేసి అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. అనసూయ ఏ పోస్ట్ చేసిన దానిపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు విజయ్ ఫ్యాన్స్. రీసెంట్ గా ఇకపై విజయ్ జోలికి వెళ్లానని పబ్లిక్ గా చెప్పింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అనసూయ ను వదిలిపెట్టడం లేదు. వీరి దాడిని తట్టుకోలేక మరోసారి అభిమానుల ముందు తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

‘అందరికి నమస్కారం. కొన్ని రోజులుగా నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను అగౌరవపరిచేందుకు నా పేరును వాడుకుంటున్నారు. ఇలా చేస్తున్నందుకు నాకు చాలా అమర్యాదగా, అగౌరవంగా ఉంది. ఇది నా పేరును కించపరిచేలా ఉంది. వీటితో నాకెలాంటి సంబంధం లేదు. ఇది అనవసరమైన బాధను కలిగిస్తోంది. ఇది నా లైఫ్‌. నాకు నచ్చిన విధంగా లీడ్‌ చేస్తున్నా. అలాగే నేను ఎవరి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. నేను నా స్వశక్తితో ఎదిగిన ఒక మహిళని. నా గురించి గొప్పగా చెప్పేందుకు నాకు ప్రత్యేకంగా పీఆర్‌ టీమ్స్‌ లేవు. మీరు నన్ను ఎంకరేజ్‌ చేయడం ఇష్టం లేకపోతే కనీసం నా నుంచి దూరంగా ఉండండి. నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరును లాగకండి. అలా చేయకుండా ఉండేందుకు తగినంత దయ చూపించండి. కాస్త మనుషుల్లా ప్రవర్తించండి ప్లీజ్‌. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. దయచేసి ఇక ఆపేయండి’ అని రిక్వెస్ట్‌ చేసింది. ప్రస్తుతము ను చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తోనైనా ఆమెను టార్గెట్ చేయడం తగ్గిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News