Saturday, July 12, 2025
HomeNewsAnnadatha Sukheebhava: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యేది అప్పుడే!

Annadatha Sukheebhava: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యేది అప్పుడే!

Good News For Farmers: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమాన్ని ప్రథమంగా పరిగణిస్తున్న కూటమి ప్రభుత్వం, వ్యవసాయంపై ఆధారపడి జీవించే అన్నదాతలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ పథకం అమలుకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసి, గ్రామ సచివాలయాలు మరియు అధికారిక వెబ్‌సైట్లలో ఉంచారు. ఈ పథకం కింద జూన్ నెలాఖరుకే నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యం అయింది. అయితే, త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం “అన్నదాత సుఖీభవ” పథకాన్ని సమాంతరంగా అమలు చేయనుంది.

- Advertisement -

ప్రతి రైతుకు ఏడాదికి ₹14,000 అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా తొలి విడతలో పీఎం కిసాన్ పథకం ద్వారా ₹2,000, అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ₹5,000 చొప్పున మొత్తం ₹7,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, జులై 9వ తేదీ తరువాత ఆ మొత్తాలు అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులూ విడుదల అవుతాయని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.

అర్హత ఉన్నప్పటికీ కొంతమంది రైతుల పేర్లు జాబితాలో లేకపోవడం వల్ల వారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, అర్హత ఉన్న వారు అవసరమైన పత్రాలు సమర్పిస్తే దరఖాస్తును పునఃపరిశీలిస్తామని తెలిపింది. ఇందుకోసం RBK కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అక్కడ సమాచారం అందుబాటులో లేకపోతే, సమీపంలోని సచివాలయంలోని Rythu Bharosa Kendram (RBK) అధికారిని సంప్రదించవచ్చు. పేరు లిస్టులో లేనట్లయితే, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసి అర్హతను నిరూపించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఎవైనా రైతులు పథకం వివరాల గురించి స్పష్టత పొందాలనుకుంటే, లేదా సమస్యలు ఎదురవుతున్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 155251 కు కాల్ చేయవచ్చు. అక్కడ మీ దరఖాస్తు వివరాలపై సహాయం అందించబడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News