Friday, January 31, 2025
HomeNewsDwaraka Tirumala Rao: డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్ర భావోద్వేగం

Dwaraka Tirumala Rao: డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్ర భావోద్వేగం

ప్రస్తుత ఏపీ డీజీపీ(AP DGP) ద్వారకా తిరుమలరావు(Dwaraka Tirumala Rao) నేటితో పదవీ విరమణ చేయనున్నారు. ఈమేరకు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో వీడ్కోలు పరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -

ఇకపై తన ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ ఉండదని ఆలోచిస్తేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పోలీసింగ్ వైపు నడుస్తున్నామని చెప్పారు. ఇటీవల సంభవించిన విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానన్నారు.

ఇక కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తిమేర పని చేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News