Saturday, November 15, 2025
HomeNewsAUS vs IND: టీమ్‌ఇండియాకు షాక్‌: అభిషేక్‌ శర్మ ఔట్‌

AUS vs IND: టీమ్‌ఇండియాకు షాక్‌: అభిషేక్‌ శర్మ ఔట్‌

AUS vs IND:భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఐ అంతర్జాతీయ మ్యాచ్‌ కెన్బెర్రాలో జరుగుతోంది. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌ ఎంచుకోగా, టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. క్రీజులో అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. టీమ్‌ఇండియాకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఔట్‌ అయ్యాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌ అటాక్‌ ప్రారంభించాడు. ఆసక్తికరంగా, మార్ష్‌ ఇప్పటి వరకు 18 సార్లు టాస్‌ గెలిచినా, ప్రతీసారి మొదట బౌలింగే ఎంచుకున్నాడు. టాస్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, “మేం మొదట బ్యాటింగ్‌ చేయడానికే ఆసక్తిగా ఉన్నాం. ఇది మంచి పిచ్‌లా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ కొంచెం స్లో అవుతుందని విన్నా. అందుకే ముందుగా బ్యాటింగ్‌ చేయాలని అనుకున్నాం. మేమంతా కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి చేరుకున్నాం. నిన్న, మొన్న వాతావరణం చల్లగా ఉండగా, ఈరోజు బాగుంది. అందరం మంచి ప్రదర్శన ఇస్తామనుకుంటున్నా. ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఎంపిక కాస్త కష్టమైంది, ఎందుకంటే అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇది మంచి తలనొప్పి” అన్నారు. రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అర్షదీప్‌ సింగ్‌, నితీశ్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని ఆయన వెల్లడించారు.

- Advertisement -

ఇది మంచి పిచ్‌
‘మేం మొదట బౌలింగ్‌ చేయాలనుకుంటున్నాం. ఇది మంచి పిచ్‌. టీమ్‌ఇండియా టీ20 ఫార్మాట్లో నంబర్‌ 1 జట్టు. ప్రస్తుతం అన్ని జట్లు.. రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేం నంబర్‌ 1 టీమ్‌ అయిన భారతజట్టుతో తలపడనున్నాం. మేం దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ టాస్‌ గెలిచిన అనంతరం అన్నాడు.
భారత జట్టు తుది జాబితా
అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా
ఆసీస్‌ జట్టు తుది జాబితా
మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిబడ్‌, మిచెల్‌ ఓవెన్‌, మార్కస్‌ స్టోయినిస్‌, జోష్‌ ఫిలిప్‌, జేవియర్‌ బ్రాట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌, మాథ్యూ కుహ్నెమాన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad