ఐఐఎంసి కళాశాల-ఆంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బి స్కూల్స్ ఫెయిర్ అండ్ ఎం.బి.ఏ. ఎక్స్ పో 2024 ను లకిడీకాపూల్ లోని వాసవి కళ్యాణ మండపంలో డిసెంబర్ 7, 8 వ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.
డిగ్రీ తదనంతర కోర్సులపై అవగాహన
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఐఐఎంసి కళాశాల ప్రిన్సిపల్ రఘువీర్ విడుదల చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు డిగ్రీ తదనంతర కోర్సులపై అవగాహన కలుగుతుందన్నారు. దేశ విదేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న బిజినెస్ స్కూల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమానికి 8 సంస్థలు స్పాన్సర్షిప్ ను అందిస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇప్పటికే కళాశాల స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్ల ద్వారా వివిధ కళాశాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి వాణిజ్య, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ తదనంతర కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాల్సినదిగా నిర్వాహకులు తెలియజేశారు.