పెద్దకడబూరు మండల కేంద్రమైన పెద్దకడుబూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన,ఎంపీడీవో ప్రభాకర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖ అధికారులు తమకు సంబంధించిన జరిగిన మూడు నెలల అభివృద్ధి పనుల నివేదికలతో ఈ సమావేశంలో తెలియజేశారు. అనంతరం మంత్రాలయం శాసనసభ్యులు బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి కళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, అదే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి చేరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి దశగా మండలంలో రోడ్ల అభివృద్ధి పనులు కోసం ఎమ్మిగనూరు నుండి మాలపల్లి వరకు వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నామని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వసభ్య సమావేశాల్లో కచ్చితంగా ప్రతి అధికారి మూడు నెలల జరిగిన అభివృద్ధి నివేదికలతో రాతపూర్వకంగా ఒక బుక్లెట్ ద్వారా హాజరుకావాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీలకు, సర్పంచులకు ప్రజా నివేదిక బుక్లెట్లను తప్పకుండా అందించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ డి వో నాగేశ్వరరావు, ఎంపీడీవో ప్రభాకర్, ఎమ్మార్వో వీరేంద్ర గౌడ్, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ శ్రీవిద్య, జడ్పిటిసి జాము రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ ఎం.రామాంజనేయులు, వైస్ ఎంపీపీ ముత్తమ్మ, వైస్ ఎంపీపీ ఇర్ఫాన్,ఈ ఓ ఆర్ డి జనార్ధన్,మండల వైద్యాధికారిని శాంతి జ్యోతి, విద్యాధికారిని సువర్ణల సునియం, విద్యాధికారి బి.రామ్మూర్తి, పి ఆర్ ఏ ఈ మల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్, మండల వ్యవసాయ అధికారి ఎం.వరప్రసాద్, హౌసింగ్ ఏఈ వేణుగోపాల్, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.