Thursday, September 19, 2024
HomeNewsban lifted: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు గ్రీన్ సిగ్నల్, ఎక్కడంటే...

ban lifted: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు గ్రీన్ సిగ్నల్, ఎక్కడంటే…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ డిపార్ట్మెంట్ (ఈ.సి.సి.డి) ఆదేశాలు జారీచేసింది. నాలుగేళ్లపాటు కొన్ని పాక్షిక సడలింపులు ఇవ్వక తప్పదని రాష్ట్ర ప్రభుత్వం భావించటమే ఇందుకు కారణం. స్పూన్లు, స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులతో పాటు కంపోస్టబుల్ మెటీరియల్ తో తయారైన కంటైననర్లను ఈ జాబితాలో చేర్చింది. దీంతో 60 జీఎస్ఎం లోపున్న నాన్-వోవెన్ పాలీప్రాపెలిన్ బ్యాగులు, 50 మైక్రాన్ల లోపు మందమున్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ను వాడేందుకు అనుమతి లభించినట్టైంది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో జరిగిన కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుని తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. కంపోస్టబుల్ మెటీరియల్ అనే ముడి పదార్థంతో తయారయ్యే వాడి పడేసే సింగిల్ యూజ్ ఐటెమ్స్ తయారు చేసేందుకు, విక్రయించేందుకు సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వద్ద నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవటం తప్పనిసరిగా జీవోలో పేర్కొన్నారు. అంటే సింగిల్ యూజ్ వస్తువుల తయారీకి ముందుగానే అవసరమైన అనుమతులు తెచ్చుకోవటం తప్పనిసరి అన్నమాట.

- Advertisement -

డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు

నర్సరీ మొక్కల పెంపకం, హార్టికల్చర్ సాగు, వ్యవసాయం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కంపోస్టబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగంపై మహారాష్ట్రలో నిషేధం ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే పరిశ్రమల నుంచి మరాఠా సర్కారుపై తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో వారి కొన్ని డిమాండ్లకు తలొగ్గక తప్పలేదని సర్కారు తేల్చి చెప్పింది.

2018 నుంచే ఇక్కడ బ్యాన్

మహారాష్ట్రలో వివిధ రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం, ఉత్పత్తిపై 2018 మార్చ్ నుంచి నిషేధం అమల్లో ఉండగా వీటిని నిల్వ చేయటం, విక్రయించటాన్ని కూడా సీరియస్ గా సర్కారు పరిగణిస్తూ వచ్చింది.

ప్లీజ్, మీరూ అలా లిఫ్ట్ చేయండి

అయితే మహారాష్ట్ర సర్కారు బాటలో నడుస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సింగిల్ యూజ్ వస్తువుల వాడకంపై నిషేధాన్ని సడలించాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని మూసివేయటంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయారని సింగిల్ యూజ్ వస్తువుల ఉత్పత్తిదారుల సంఘం ప్రభుత్వానికి వరుస విజ్ఞప్తులు చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News