Sunday, February 23, 2025
HomeNewsBansuwada: బీర్కూర్ లో సబ్ కలెక్టర్ కార్యక్రమాలు

Bansuwada: బీర్కూర్ లో సబ్ కలెక్టర్ కార్యక్రమాలు

సమస్యలు స్వయంగా..

బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆకస్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బాన్సువాడ నియోజవర్గంలోని బిర్కూర్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుపతి దేవస్థానం దర్శించుకొని ఆశీర్వాదం పొందారు.

- Advertisement -

అనంతరం బిర్కూరు గ్రామ పంచాయతీ అవెన్యూ ప్లాంటేషన్ ను సందర్శించి ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్ళు పోయడాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేజీ బీవీ స్కూల్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించి వేసవి కాలములో కరెంట్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సిబ్బందికి సూచించారు.

వేసవి కాలములో ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, ఎంపీఓ, ఎంపీ ఎస్ఓ, ఈ ఆర్డబ్ల్యూఎస్, మండల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News