HomeNewsTkr college: తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Tkr college: తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Tkr college: మీర్ పేట్ లోని తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో 5 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొని బతుకమ్మ, దాండియా కార్యక్రమాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి, సెక్రటరీ హరినాథ్ రెడ్డి, ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డితో పాటు ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు హాజరయ్యారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ పాటలు, దాండియా నృత్యాలతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

- Advertisement -

ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతి ఇంటా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం మహిళలకు, ఆడపడుచులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ, దాండియా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక నగదు బహుమతులను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News