Batukamma: జాతీయ సారస్ మేళా–2026లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. తెలంగాణకు చెందిన 75 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. SERP తెలంగాణకు చెందిన శ్రీ రాము ఏలూరి, శ్రీమతి దివ్య నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయ పూలతో బతుకమ్మలను అలంకరించి, జానపద గీతాలతో పండుగ సంబరాలు చేసుకున్నారు.
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు, ఈ మేళాలో పాల్గొన్నారు. తెలంగాణ మహిళలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని ఇతర ప్రాంతాల మహిళలకు పరిచయం చేశారు. మహిళల ఉత్సాహాన్ని CEO, SERP, ఆంధ్రప్రదేశ్ అభినందించడంతో పాటు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు, జాతీయ సారస్ మేళాలో మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు రూ.1.08 కోట్ల విలువైన 47.23 వేల ఉత్పత్తులు విక్రయమయ్యాయి. అక్టోబర్ 16న ఒక్కరోజే రూ.51.65 లక్షల విలువైన 25.34 వేల ఉత్పత్తుల అమ్మకాలు నమోదయ్యాయి.

