Friday, September 20, 2024
HomeNewsBelly button oil treatment: బొడ్డుకు నూనె మసాజ్

Belly button oil treatment: బొడ్డుకు నూనె మసాజ్

ఎసెన్షియల్ ఆయిల్స్ తో నావెల్ చక్ర థెరపీ

బొడ్డుకు నూనె మసాజ్ చేస్తే..
బొడ్డుకు నూనెను రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు చర్మం నిపుణులు. నూనెలు బొడ్డుకు కూడా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ ని అందిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా చలికాలం నూనెలు చర్మానికి అందించే తేమ ఎంతోనంటున్నారు. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ చర్మానికే కాదు బొడ్డుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. బొడ్డుకు కావలసినంత తేమను అందిస్తాయి. ఇందుకు కారణం వీటిల్లో ఫ్యాటీ యాసిడ్ ఉండడమే. బొడ్డు భాగంలో కొద్దిగా నూనె రుద్దితే ఆ ప్రదేశంలోని చర్మం సిల్కీగా, మరెంతో మ్రుదువుగా ఉంటుంది. అందులోనూ బొడ్డు భాగంలో నూనె బాగా రాసి స్నానం చేస్తే ఆ ప్రదేశంలోని చర్మం మిలమిల మెరుస్తుంటుంది. సాధారణంగా చాలామంది బొడ్డు లోపలి భాగాన్ని నిత్యం శుభ్రం చేసుకోరు. కానీ, నిత్యం బొడ్డు భాగాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలంటున్నారు. కాటన్ స్వాబ్ తీసుకుని జొజొబా లేదా శాఫ్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని కాటన్ ని అందులో ముంచి బొడ్డు భాగంలో రాస్తే బొడ్డులోని మలినాలు, మ్రుతకణాలు పోతాయి.

- Advertisement -

అలాగే బొడ్డు లోపల కాటన్ తో సున్నితంగా శుభ్రం చేయాలి. గట్టిగా రబ్ చేయకూడదు. అలా చేస్తే బొడ్డు లోపల గాయం కావొచ్చు. తీవ్ర నొప్పి కలగవచ్చు. ఫలితంగా బొడ్డు భాగంలో ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తవచ్చు. అందుకే బొడ్డును క్లీన్ చేసేటప్పుడు లోపలి భాగాన్ని దూదితో సున్నితంగా శుభ్రంచేయాలి. ఇలా బొడ్డును తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల అందులో చేరిన మురికి పోయి ఆ ప్రదేశం ఇన్ఫెక్షన్ల బారిన పడదు. బొడ్డులోని మురికి అలాగే ఉంటే ఇన్ఫెక్షన్, ఫంగస్ లు చేరే ప్రమాదం ఉంది. చాలాకాలం పాటు బొడ్డులోని మురికిని శుభ్రం చేసుకోకపోయినా కూడా ఆ ప్రాంతంలో తేమ చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది.

సరైన ఆయిల్స్ తో బొడ్డును శుభ్రం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంగా చేరిన తేమ పోయి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ తగ్గడానికి టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ లో ఎంతో శక్తివంతమైన యాంటిబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. వనూనె కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో బాగా పనిచేస్తుంది. ఆవనూనెలో బాక్టీరియాను నశింపచేసే గుణాలు ఉన్నాయి. మూడు
చుక్కల నుంచి ఒక టీ స్పూను కొబ్బరినూనెను బొడ్డులో వేసి శుభ్రం చేయొచ్చు. కొబ్బరినూనె కూడా యాంటీ బాక్టీరియల్ ఆయిల్.

బొడ్డులో ఇన్ఫెక్షన్ తగ్గడానికి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు బొడ్డుపై దీన్ని అప్లై చేస్తే చాలు. బొడ్డుకు నూనెను రాయడం వల్ల కడుపునొప్పి తగ్గుతుంది. అజీర్ణం, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుంచి సాంత్వన లభిస్తుంది. బ్లోటింగ్, వికారం వంటి సమస్యలకు నేచురల్ రెమిడీగా కూడా పనిచేస్తుంది. పలచగా చేసిన ఎసెన్షియల్ ఆయిల్ని బొడ్డుపై రాయడం వల్ల సహజమైన సాంత్వన పొందుతారు. పిప్పర్ మెంట్, సిప్రస్, జింజర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా బాగా పనిచేస్తాయి.
బొడ్డు భాగంలో ఎసెన్షియల్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల బహిష్టు నొప్పి కూడా తగ్గుతుంది. సంతానం పొందడానికి, బొడ్డుకు సన్నిహిత సంబంధం ఉండడం ఆశ్చర్యం కలిగించే మరో విషయం. పిల్లలకు బొడ్డుతాడు ఉండడం గురించి అందరికీ తెలుసు. బొడ్డు భాగంలో నూనె రాసుకోవడం పురుషుడుతోపాటు స్త్రీలలో కూడా సంతాన అవకాశాలను మెరుగుపరుస్తుందంటారు. ఈ ప్రదేశంలో కేరియర్ ఆయిల్ ని పలచగా చేసిన ఎసెన్షియల్ ఆయిల్ లో కలిపి రాయాలి. ఇలా చేస్తే హార్మోన్లు క్రమబద్ధమవుతాయి. పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగుపడతాయట.

ఎసెన్షియల్ ఆయిల్ మసాజ్ నావల్ చక్ర (బొడ్డు)ను సమతుల్యం చేస్తుందంటారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని ఆయుర్వేద భాషలో స్వాధిష్టాన అంటారు. ఎనర్జీకి, ఇమేజినేషన్ కు దీన్ని మూల కేంద్రంగా పేర్కొంటారు. గ్రేప్ సీడ్ ఆయిల్ని బొడ్డులో కొన్ని చుక్కలు వేసి మసాజ్ చేయాలంటారు. శాండల్ వుడ్, రోజ్ వుడ్, లాంగ్ లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మరిన్ని లాభాలు పొందవచ్చని కూడా ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వారానికి ఒకసారి ఇలా చేస్తే మనిషి క్రియేటివ్ ఇమేజినేషన్ బాగా వ్రుద్ధి చెందుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తారు.

అయితే ఎసెన్షియల్ ఆయిల్ ని ఉపయోగించేటప్పుడు దాన్ని పలచగా (డైల్యూట్) చేయడం మరవొద్దు. ఎందుకంటే అవి చాలా గాఢతను కలిగి ఉంటాయి. అలాగే వాటిని చర్మంపై రాస్తే ఇరిటేషన్ కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఎసెన్షియల్ ఆయిల్ ను ఉపయోగించేటప్పుడు గమనించుకోవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ముందుగా చర్మంపై ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. ఆ ఆయిల్ వల్ల ఎలాంటి ఎలర్జీ లేదని ధ్రువీకరించుకున్న తర్వాతే దాన్ని వాడాలి. ఈ విషయమై చర్మ నిపుణులను సంప్రదించి వారి సలహాలు అనుసరించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News