Tuesday, February 10, 2026
HomeNewsBhagavad Gita At Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది కాలి బూడిద అయిపోయిన.....

Bhagavad Gita At Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది కాలి బూడిద అయిపోయిన.. భగవద్గీత మాత్రం చెక్కుచెదరలేదు..

Bhagavad Gita At Ahmedabad Viral video: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సంఘటన స్థలానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రస్తుతం శిథిలాల కింద ఒక భగవద్గీత పుస్తకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న విమానం గురువారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 246 మంది మరణించారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు రావడంతో విమానం బూడిదైపోయింది. దీంతో సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా శిథిలాల కింద ఉన్న భగవద్గీత బయటపడింది. ఈ ఘోర ప్రమాదంలో కూడా పుస్తకం చెక్కు చెదరకుండా ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

- Advertisement -

విమానంలో వచ్చిన మంటలకు మనుషులతో సహా అన్నీ దగ్థం అయ్యాయి.. కానీ భగవద్గీత ఏ మాత్రం కాలిపోలేదు. అది ఎలా సాధ్యం అని నెటిజన్‌లు షాక్‌ అవుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను “amdavad.clicks” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఈ వీడియోను 177,838పైగా లైక్స్ చేశారు. ఈ విడియో చూసిన ప్రతి ఒక్కరు వివిధ ప్లాట్‌ ఫామ్‌లో షేర్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News