Bigg Boss 9: టీవీ రియాలిటీ షోలు టీఆర్పీ కోసం ఎంతలా దిగజారిపోతాయో తమిళ బిగ్ బాస్ ని చూస్తే తెలుస్తోంది. అందుకోసం ఎంచ క్రియేటివ్ ప్రయత్నిస్తాయో ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ 9 ఉదాహరణగా కనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన ప్రోమోలో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన ఘర్షణ ఒక్క క్షణంలో నెట్టింట హాట్ టాపిక్ అయింది. కమ్రుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య మాటల వాగ్వాదం మొదట చిన్నగా మొదలైనా, క్రమంగా ఒకరిపై ఒకరు అరుపులు, కేకలు తో తారాస్థాయిగా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. ఇద్దరి మధ్య గొడవ క్రముద్దీన్ కోపంతో ప్రవీణ్ పైకి దూసుకెళ్లాడు.. ఇది ప్రోమోలో స్పష్టంగా కనిపించింది. ఇతర హౌస్ మేట్స్ వీరిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫలితంగా, ఈ క్రమంలో క్రముద్దీన్, ప్రవీణ్ ఒకరినొకరు నెట్టుకోవడం, తోసుకోవడం బిగ్ బాస్ టీం విడుదల చేసిన వీడియోలో కనిపించింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద హల్‌చల్ నే సృష్టించింది. “ఇది నిజంగానే జరిగింది లేదా షో కోసం ప్లాన్ చేశారా?” అనే సందేహం ఆడియన్స్ లో కూడా పెరిగింది.
Read Also: Bigg Boss Updates: భరణి బలి.. తనూజ ఏడుపే ఏడుపు
ఇదంతా ప్రాంక్
అయితే, ఫుల్ ఎపిసోడ్ చూశాక ఈ ఘర్షణ ఒక ప్రాంక్ మాత్రమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో క్రముద్దీన్, ప్రవీణ్ హౌస్‌లో ఈ ప్రాంక్ ద్వారా విజయం సాధించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నెట్టింట వైరల్ అయిన క్లిప్ వల్ల ఆడియెన్స్ షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో షో మేకర్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. “టీఆర్పీ కోసం ఇంతా దిగజారుతారా?” అంటూ దారుణ కామెంట్స్ వస్తున్నాయి. తమిళ్ బిగ్ బాస్ 9 సీజన్ ప్రస్తుతం 5వ వారంలో ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత నలుగుకు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. మరోవైపు, ఈ వారంలో నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా జరిగింది. వినోద్, వియానా, శబరి, విక్రమ్, పార్వతి, కమ్రుద్దీన్, ప్రవీణ్, కెమి, తుషార్, దివాకర్, రమ్య జో ఇలా మొత్తం 12 మంది నామినేట్ అయ్యారు.
Read Also: Bigg Boss 9 Telugu: పాపం తనూజ.. మరోసారి కెప్టెన్ గా అతడే..!
విజయ్ సేతుపతి ఏమంటారో?
అయితే, ఇప్పుడు ఆడియెన్స్ ఈ ప్రాంక్ గురించి ఫుల్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రాంక్ చేయమని అడిగితే.. కొట్టుకునేంత వరకు వెళ్లారని మండిపడుతున్నారు. ప్రాంక్ కి, కొట్టుకోవడానికి కూడా తేడా తెలియదని ఫైర్ అవుతున్నారు. అయితే, కంటెస్టంట్ల మధ్య గొడవపై వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రామా చేసినందుకు వారిద్దర్నీ మెచ్చుకుండా లేదా కొట్టుకున్నారని కోపానికి వస్తాడో తెలియాల్సి ఉంది. విజయ్ సేతుపతి ప్రాంక్ విషయంలో కంటెస్టెంట్ల తీరుపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు, ఈ ప్రాంక్, గొడవ కూడా బిగ్ బాస్ 9కి కావలసిన డిజిటల్ హిట్‌ను ఇచ్చిందని చెప్పాలి. తమిళ బిగ్ బాస్ టీఆర్పీ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలోనూ ఫుల్ గా హైప్ వచ్చింది.
#Day30 #Promo1 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/jrFCHSPK8j
— Vijay Television (@vijaytelevision) November 4, 2025

