Saturday, November 15, 2025
HomeNewsBiggBoss Written Updates: నువ్వు పుండు మీద పిన్నీస్ పెట్టి పొడిచే రకం.. కళ్యాణ్ కు...

BiggBoss Written Updates: నువ్వు పుండు మీద పిన్నీస్ పెట్టి పొడిచే రకం.. కళ్యాణ్ కు ఇంకో అమ్మాయి కావాలంట..

Bigg Boss Written Updates: బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ అంటే సొల్లు కబుర్లు చెప్పినంత ఈజీ కాదు. సీజన్ మొదలయ్యే ప్రతిసారి ఈసారి మాములుగా ఉండదు, ఉల్టా పుల్టా, చదరంగం కాదు రణరంగం అంటూ ఊదరగొడుతూ ఉంటారు. తీరా లోపలికి వెళ్లిన కంటెస్టెంట్లు రణరంగం మాట పక్కనపెట్టి సొల్లికబుర్లు చెప్తుంటారు. ఈ సీజన్ కూడా అలాగే తగలడింది. అగ్నిపరీక్ష వీరులు అంటూ లోపలికి వదిలిన ఇద్దరు పవనాలు (పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్) రీతూని ఓదార్చడంతోనే మునిగి తేలుతున్నారు. దీంతో వీళ్లని తెగ్గొట్టి ఆటని ముందుకు నడిపించడానికి కొత్త అస్త్రాన్ని హౌస్‌లోకి వదిలాడు బిగ్‌బాస్.

- Advertisement -

హౌస్ మేట్స్ కి అప్పీల్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్ అడుగుపెట్టింది. పేరుకి కొత్త కానీ ఆడియన్స్‌కి మాత్రం ఏం కొత్త కాదు లెండి. అగ్నిపరీక్ష ద్వారా ఆడియన్స్‌కి దగ్గరైన దివ్య నికితా వైల్డ్ కర్డ్ ఎంట్రీ ద్వారా లేటెస్ట్ ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వచ్చింది. అయితే, అగ్నిపరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురిని అనూష రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్‌లని హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. ఈ హౌస్‌లో మీరు ఎందుకు ఉండాలి.. అనేది హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి అర్థమయ్యేలా ఒకే ఒక అప్పీల్ చేసుకోండి అంటూ బిగ్‌బాస్ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆ నలుగురు వాళ్ల వాళ్ల స్టయిల్లో తాము ఎందుకు స్పెషల్.. హౌస్‌లోకి వస్తే ఏం చేస్తాం.. ఏం పొడిచేస్తామనే చెప్పుకున్నారు. అలానే హౌస్ లోకి వాళ్ల ఎంట్రీ ఎందుకు అనే అంశంలో వాళ్లని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి అంటూ బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్‌కి కూడ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఏదో స్పెషల్ పవర్ వచ్చిందన్న రేంజ్ లో కామనర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. తీరా సమాధానం విన్న తర్వాత అడిగి మరీ తన్నించుకున్నామే అనుకునేలా ఈ అగ్నిపరీక్ష వీరులు ఆన్సర్లు ఇచ్చారు. వాళ్ల ఆన్సర్లకి వీళ్లు ఇచ్చిన ఎక్స్‌‌ప్రెషన్స్ అబ్బబ్బ.. అవి చూడాల్సిందే అనుకోండి.

నువ్వు పుండు మీద పిన్నీస్ పెట్టి పొడిచే రకం

ఎవరైనా కొశ్చన్‌లు అడగొచ్చు అనగానే కామనర్లు చేయి ఎత్తారు. ముందుగా శ్రీజ పైకి లేచి మీరు హౌస్‌లోకి రావాలనుకుంటే ఇక్కడున్నవాళ్లలో ఎవరిని స్వాప్ చేస్తారు, ఎందుకు.. రీజన్ చెప్పండి అని అడిగింది. అయితే, దీనికి గూబ పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చింది అనూష రత్నం. నేను అయితే నిన్నే స్వాప్ చేస్తా శ్రీజ. ఎందుకంటే హౌస్‌‌లో నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు.. నీ ఇగో సాటిస్‌ఫై అవ్వకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడిచినట్లు ఆ ఇష్యూని సాగదీస్తూనే ఉంటావ్.. అంటూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది. ఈ మాటలకి శ్రీజ కాస్త హర్ట్ అయింది. ఇక దివ్య కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది. నాకు అవకాశం ఉంటే శ్రీజతో స్వాప్ చేసుకుంటా అంటూ బదులిచ్చింది.

Read Also: Asia Cup: ఆసియా కప్ లో బంగ్లా ఓటమి.. పాక్‌తోనే భారత్ ఫైనల్‌

కళ్యాణ్ బాబు ఎక్కువైనట్లుంది కాస్త

ఇక షాకీబ్, నాగని ఇదే కొశ్చన్ అడగ్గా ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో స్వాప్ చేస్తామంటూ బదులిచ్చారు. అగ్నిపరీక్షలో నువ్వు చాలా బాగా ఆడావ్.. కానీ హౌస్‌లో ఆ ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు.. అసలు నీ గేమ్ కూడా కనిపించట్లేదు.. అందుకే నిన్ను నేను రీప్లేస్ చేస్తానంటూ నాగ అన్నాడు. దీనికి కళ్యాణ్ డైలాగ్ ఒకటి కొట్టాడు చూడండి.. అది సూపరహే అసలు.. ఏంటి నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా.. నా ఫ్రాంక్‌‌నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా.. అంటూ కాలు మీద కాలేసుకొని కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వింటే ఆడియన్స్ ఏ డౌటా.. నాగ చెప్పింది కరెక్టేకా అనుకొని ఉంటారు. ఇక వీళ్ల ఓట్ అప్పీల్ అయిపోయిన తర్వాత హౌస్‌మేట్స్‌లో డిస్కషన్ మొదలైంది.

బిగ్‌బాస్ వీడికి ఇంకొక అమ్మాయి కావాలంట

అయితే హౌస్‌మేట్స్ డిస్కషన్‌లో ఎక్కువగా నాగ పేరే వినిపించింది. ఎందుకంటే దివ్య పేరు రాగానే ఆమె కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది.. అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంది అంటూ రీతూ సహా కొంతమంది అన్నారు. ఇక అనూష అయితే ఓవర్ స్మార్ట్‌గా మాట్లాడినట్లు ఉంది అని భరణి అన్నాడు. ఇక నాగ అయితే జెన్యూన్‌గా మాట్లాడాడు అని ఇమ్మూ సహా ఇద్దరు ముగ్గురు అన్నారు. రీతూ చౌదరి అయితే నాకు నాగ లేదా షాకీబ్ ఇద్దరిలో ఎవరైనా ఓకే అంటూ చెప్పింది. డీమాన్ మాత్రం.. హే కాదు వాళ్ల ఆట మేము చూశాం కదా దివ్య అయితే బావుంటుంది అన్నాడు. ఈ మాట వినగానే పక్కనే ఉన్న సంజన కౌంటర్ వేసింది.ఇంకొక అమ్మాయి కావాలంట వీడికి.. చూడండి బిగ్‌బాస్.. అంటూ సంజన ఏడిపించింది. కాసేపటికి బిగ్‌బాస్ ఓటింగ్ ఏర్పాటు చేశాడు. ఓటు వేయాల్సిన సమయం వచ్చింది.. ఇద్దరు వ్యక్తుల ముఖాలపై టిక్ పెట్టి బ్యాలెట్ బాక్స్‌లో వేయండి.. మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు.. అంటూ బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు.

Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ కు ఐసీసీ వార్నింగ్.. జరిమానా లేదా డీమెరిట్..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad