అమెజాన్ అడవుల్లో ఏమి జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. ప్రతి అడుగు అక్కడ కొత్త జంతువులు, పక్షులు, పాములు.. ప్రతి జీవి అబ్బురపరిచే విధంగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా అక్కడి నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఒక భారీ నల్ల అనకొండ నదిలో ఈత కొడుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యం, ఆందోళన, భయం అనే మూడూ కలిసిపోయిన స్పందనతో స్పందిస్తున్నారు.
వీడియోలో కనిపించిన అనకొండ చాలా భారీగా ఉంది. దాని పొడవు, మందం చూసినప్పుడు… ఇది సాధారణ పాముగా కాదు, బహుశా ఇప్పటివరకు కనిపించిన అతిపెద్ద అనకొండల్లో ఒకటై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పాము నల్లగా కనిపించడంతో అది ‘బ్లాక్ అనకొండ’ అనే అరుదైన జాతికి చెందినదే అయి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, అది నీటిలో పడిన కాంతి ప్రభావం వల్లే నల్లగా కనిపించి ఉండొచ్చు.
ఈ వీడియో పాములను సినిమాల్లో మాత్రమే చూసినవారికి షాక్ ఇచ్చేలా ఉంది. హాలీవుడ్ చిత్రాల్లో అనకొండలు మనుషులను తినే, చెట్లు తిరిగే దృశ్యాలు చూసి అవి గ్రాఫిక్స్ అనుకునే వారికీ ఇప్పుడు ఆ సినిమాలే నిజంగా మారినట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత “ఇలాంటి జీవులు నిజంగా ప్రకృతిలో ఉన్నాయా?” అనే ప్రశ్నలు తిరుగుతున్నాయి.
అమెజాన్ అడవి గురించి మాట్లాడితే, అక్కడి జీవ వ్యవస్థ అంతులేని రహస్యాలు. ఇప్పటికీ ఎందరో శాస్త్రవేత్తలు అక్కడి జీవాలను అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా అనేక జాతులు మానవ కన్నుపాటుకు దూరంగానే ఉన్నాయి. ఈ నల్ల అనకొండ వీడియో మరోసారి అమెజాన్ లోని ఆ మర్మజీవుల వైపు ప్రపంచాన్ని మళ్లించింది.
ఈ వీడియో చూసిన ప్రజలు తమ అనుభూతులను షేర్ చేస్తూ, ఇది అద్భుతం, భయంకరమైన అనుభూతి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాముని డైరెక్ట్ గా చూస్తే హార్ట్ ఆగిపోతుందని నెటిజన్లు అంటున్నారు.