Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభBollywood: హిందీ సినిమా పరువు నిలిపిన హీరోయిన్ టబూనే, 50ల్లోనూ తగ్గేదేలే అంటున్న బ్యూటీ

Bollywood: హిందీ సినిమా పరువు నిలిపిన హీరోయిన్ టబూనే, 50ల్లోనూ తగ్గేదేలే అంటున్న బ్యూటీ

కోవిడ్ తరువాత బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క హిట్స్ లేక చతికిలపడింది. మరోవైపు ఇండియాలో ఓవర్సీస్లో సౌత్ సినిమాలు దుమ్ము లేపుతున్నాయి. దీంతో బాలీవుడ్ కథైపోయిందని ఇక అంతా టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలివుడ్ టైం అనే ప్రచారం వైరల్ అయింది. ఈటైంలో హిందీలో హిట్ అయిన సినిమాలు కేవలం రెండు మాత్రమే బాలీవుడ్ పరువు కొంత కాపాడాయని కొందరు క్రిటిక్స్, సెలబ్స్ ఓపన్ గా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. యాక్ట్రెస్ టబూ ఒంటి చేత్తో బాలీవుడ్ పరువు కాపాడారని తన ఇన్స్టా పోస్ట్ లో క్వీన్ కంగనా అప్రిసియేట్ చేశారు. భూల్ భులయ్యా 2, దృశ్యం 2 హిట్స్ తో ఇది సాధ్యమైందని, ఈ రెండు సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేసింది మాత్రం టబూనే అంటూ క్రెడిట్ ఇచ్చారు సెన్సేషనల్ సెలబ్ కంగన. 50 ఒడిలో పడ్డా కూడా టబూ తగ్గడం లేదంటూ ఆమె మెచ్చుకున్న తీరు వైరల్ అవుతోంది. ఇక కంగనా మాత్రం ఎమర్జెన్సీ సినిమాతో తన సత్తా చాటేందుకు స్పీడ్ గా రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలో వుమెన్ రోల్స్, వుమెన్ యాక్ట్రెసెస్ కు మరింత ప్రయారిటీ ఇవ్వాలని కంగనా మరోమారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News