Sunday, November 16, 2025
HomeNewsBreaking News : సౌదీలో ఘోర ప్రమాదం.. 9 మంది ఇండియన్స్ మృతి

Breaking News : సౌదీలో ఘోర ప్రమాదం.. 9 మంది ఇండియన్స్ మృతి

(Saudi Arabia)సౌదీ అరేబియా జిజాన్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగిందని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ప్రమాదంలో భారతీయ పౌరులు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని ‘ఎక్స్’ లో తెలిపింది. ఇంకా వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పింది. మరి ముఖ్యంగా ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది. మృతులు ఏయే ప్రాంతాలకు చెందినవారనే వివరాలు మాత్రం తెలియలేదు.

- Advertisement -

‘సౌదీ అరేబియాలోని పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో 9 మంది ఇండియన్స్ మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ పూర్తి సహకారం అందిస్తోంది. ఇండియాలోని అధికారులు, బాధిత కుటుంబాలతో సంప్రదింపులు చేస్తున్నాం. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.

హెల్ప్ లైన్ నెంబర్స్
మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 8002440003(టోల్‌ ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301(WhatsApp)ఏర్పాటు చేశాం’’ అని పేర్కొంది.

ఈ ప్రమాద ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పందించారు. ప్రమాదంలో భారత పౌరుల మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోన్న జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad