రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకే ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్నదని, సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
బిఆర్ఎస్ లో చేరికల పర్వం జోరుగా కొనసాగుతుంది. పరకాల పట్టణం,దామెర మండలం కోగిల్వాయి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గులాబి కండువా కప్పుకున్నారు. వారికి పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ…రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకే ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని, నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీకోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఎండి. హజి (పరకాల), ఎండి.యూసఫ్ పాష (పరకాల), ఎండి. అజ్మద్ (కొగిలవాయి)
ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మైనార్టీ సీనియర్ నాయకులు ఎండి మోయినొద్దిన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Challa Dharma Reddy: బీఆర్ఎస్ కే ప్రజల సంపూర్ణ మద్దతు
జోరుగా బీఆర్ఎస్ లోకి చేరికలు