నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు నాలుగవసారి ప్రమాణస్వీకారం చేయటం విశేషం. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని దేశ విదేశాల్లోని తెలుగువారంతా ఆసక్తిగా లైవ్ లో చూడటం విశేషం.
సినీ సెలబ్రిటీలు రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్ వంటివారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు.
ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయగా, 24 మంది మంత్రులు చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. సగానికి పైగా అంటే అక్షరాలా 17 మందికి తొలిసారి మంత్రి అయ్యే ఛాన్స్ దక్కగా, వీరిలో ముగ్గురు మహిళలు కూడా చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్నారు.
మంత్రులు వీరే..
నారా లోకోశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదేండ్ల మనోహర్, పీ నారాయణ, అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని ప్రసాద్, పార్థసారథి, వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, సంధ్యారాణి, బీసీ సంధ్యారాణి, జనారధన్ రెడ్డి, టీజీ భరత్, పవిత్ర, సుభాష్, శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి.