Saturday, January 18, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Charlapalli: రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ జెండర్లకు..

Charlapalli: రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ జెండర్లకు..

రైల్వేల్లో..


ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీనికి స్వయం ఉపాధి కల్పించి వారికి సమాజంలో గుర్తంపు లభించేందుకు చొరవ తీసుకుంటోంది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే ట్రాన్స్ జెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించగా, ఇప్పుడు వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించాలన్న సంకల్పంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

- Advertisement -

కొత్త టర్మినల్ లో కొత్త స్టాల్

ఇందులో భాగంగానే ఆధునీకరించిన చర్లపల్లి కొత్త టెర్మినల్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ స్టాల్, దానితో పాటు ఒక ట్రాలీ స్టాండ్‌ కేటాయించింది. పూర్తిగా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చెందిన వారే నిర్వహించే ఈ స్టాల్ లో స్నాక్స్, జూట్ బ్యాగ్‌లు, సబ్బులు అనేక రకాల హ్యాండ్మేడ్ ఉత్పత్తులను విక్రయానికి అందుబాటులో ఉంచారు. త్రిపుర, సహస్ర అనే ఇద్దరు ప్రతిభావంతులైన ట్రాన్స్ వుమెన్ లు ప్రత్యేకించి చేతితో తయారు చేసిన జనపనార సంచులను ఇక్కడ విక్రయిస్తారు. అలాగే కిరణ్ రాజ్ అనే ట్రాన్స్ మ్యాన్ తయారు చేసిన సబ్బులు ఈ స్టాల్లో విక్రయిస్తుండగా ట్రాన్స్వుమెన్ జాస్మిన్ స్వయంగా తయారు చేసిన క్రిప్సీ ట్రీట్లను విక్రయిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో 223 ఒక స్టేషన్–ఒక ఉత్పత్తి స్టాళ్లు
సమాజంలోని అణగారిన వర్గాలకు మార్కెట్‌ను అందించడం, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అదనపు ఆదాయ అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్ అనే భావనతో భారతీయ రైల్వేలు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని రైల్వే స్టేషన్లలో పేద వర్గాల ప్రజలు స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించుకునేందుకు అవకాశాలు కల్పించింది. ఓఎస్ఓపీ అనే ఈ ప్రత్యేక స్టాల్స్ కు స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. దీంతో దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్ స్టాళ్లు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 205 రైల్వే స్టేషన్లలో 223 వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోని 77 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 104 స్టేషన్లలో ఈ స్టాళ్లు నిర్వహిస్తుండగా, మిగతా స్టాళ్లు ఇతర డివిజన్లలో నిర్వహిస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో స్టాల్ ఏర్పాటు చేయాలంటే?
రైల్వేస్టేషన్ లో వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్ స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుగా రైల్వే అధికారులకు వార్తా పత్రికల్లో , ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనలు ఇస్తారు. ఈ ప్రకటనల ద్వారా లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలి. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ విధానంలో నిర్దేశించిన ప్రకారం, రైల్వే అధికారులు లక్ష్య సమూహాలను చేరుకోవడానికి దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించడానికి వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని లబ్దిదారులకు కేటాయిస్తారు. ఇదే ప్రక్రియ ఆధారంగానే ఇప్పటి వరకు స్టాళ్లు కేటాయించారు. ఇదే తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ లో ట్రాన్జెండర్లకు వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్స్టాల్ను కేటాయించారు. ఈ స్టాల్ను ట్రాన్స్‌జెండర్ ఎంటర్‌ప్రెన్యూర్ జాస్మిన్ ప్రారంభించారు.

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్ కమ్యూనిటీకి ఇదొక గొప్ప అవకాశం
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చాలా కాలంగా, ఉద్యోగ అవకాశాల కొరతను ఎదుర్కొంటోంది. మేము ఎక్కడకు వెళ్లినా మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. దీంతో ట్రాన్స్ కమ్యూనిటీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తుంది. “ఇప్పుడు మేము మా స్వంత వెంచర్‌లను ప్రారంభించడానికి కలిసి వచ్చాము. కొత్తగా ప్రారంభించబడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌లో మాకు ఒక స్టాల్ ట్రాలీ స్టాండ్ ఇచ్చారు. తద్వారా మా చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కలిగినట్లయింది. మేము మా స్టాల్‌లో, మా సంఘంలోని సభ్యుల ఉత్పత్తుల శ్రేణిని కొనుగోలుదార్లకు అందిస్తాము. ప్రతి అడుగు మనం ఎంత దూరం వచ్చామో గుర్తుచేస్తుంది. మేమంతా మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాం”.
– జాస్మీన్, ట్రాన్స్ వుమెన్ ,ఎంటర్ ప్రెన్యూరర్

మా మనోభలాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తుంది
“దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో మా కోసం ఈ ప్రత్యేక స్టాల్ కేటాయించి ఉపాది అవకాశాలు కల్పించడం ఒక గొప్ప అవకాశం. తద్వారా మేము ప్రజలతో మమేకం కావడానికి, మా సామర్ధ్యాన్ని ప్రజలు గుర్తించేందుకు ఇది ఒక సదావకాశంగా భావిస్తున్నాం. ఈ స్టాల్ ట్రాలీ మా కమ్యూనిటి పురోగతికి, సమానత్వ గుర్తింపుకు చిహ్నాలు.ఈ అవకాశం కల్పించిన రైల్వే అధికారులకు, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలకు ఎంతో రుణ పడి ఉంటాము”.
– త్రిపుర, ట్రాన్స్ వుమెన్…స్టాల్ నిర్వాహకులు

సమాజంలోని అన్ని వర్గాల వారి ప్రతిభకు ఇదొక వేదిక
“దక్షిణ మధ్య రైల్వే జోన్ సమాజంలోని అన్ని వర్గాల వారి సృజనాత్మకత, ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సరైన వేదిక. అన్ని వర్గాల వారికి సమాన ఉపాధి అవకాశాలను అందించడానికి దక్షిణ మధ్య రైల్వే కట్టుబడి ఉంది. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌లో వన్ స్టేషన్–వన్ ప్రాడక్ట్ స్టాల్‌ను నిర్వహించే అవకాశం ట్రాన్స్‌జెండర్లకు లభించడం హర్షణీయం ఈ స్టాల్ స్వయం సహాయక సంఘాలు, సామాజిక పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా ప్రయాణీకుల అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది”.
–అరుణ్కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News