Wednesday, February 18, 2026
HomeNewsChiranjeevi: కాజల్ ఎవరు? తమన్నా ఎవరు? అని అడిగాను - చిరంజీవి

Chiranjeevi: కాజల్ ఎవరు? తమన్నా ఎవరు? అని అడిగాను – చిరంజీవి

Chiranjeevi: చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర విజయోత్సవంలో సంతోషంగా ఉన్నారు. పండుగకు వచ్చిన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ దూసుకుపోతోంది. అయితే చిరంజీవి తాజాగా కొంత మంది మీడియా మిత్రులతో కలిసి ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన మనోగతాన్ని బయటకు తీసుకు వచ్చారు. తన అనుభవాలతో ఓ పాడ్ క్యాస్ట్‌ను చేయాలని చిరు ఆలోచిస్తున్నారట. ఈ ఐడియాని బీవీఎస్ రవి, సుష్మితలతో చిరు పంచుకున్నారట. చాలా మంది తన జీవిత చరిత్ర మీద డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటూ ఉన్నారట. కానీ తనకు మాత్రం ఇలా పాడ్ కాస్ట్ చేయాలని ఉందని మనసులో మాటను చెప్పేశారు.

- Advertisement -

ఇక ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత పూర్తిగా సినిమాల నుంచి చిరు డిస్ కనెక్ట్ అయ్యారట. ఆ తొమ్మిదేళ్లు సినిమాల గురించి పట్టించుకోలేదట. మళ్లీ రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150 టైంలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకుందామని అన్నారట. కాజల్ ఎవరు? అని అడిగారట చిరు. తమన్నా కూడా ఆ టైంలో తెలీదని, అంతగా సినిమాల నుంచి డిస్ కనెక్ట్ అయ్యాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక రెండు పడవల మీద తాను ప్రయాణం చేయలేనని, ఆ సత్తా తన తమ్ముడికి ఉందని కొనియాడారు.

Also Read – Fauzi: ద‌స‌రా బ‌రిలోకి ఫౌజీ.. త్వ‌ర‌లోనే మ‌రింత క్లారిటీ!

ఇక వ్యాపారాలు చేయడం తనకు అంతగా రాదని, అవన్నీ అల్లు అరవింద్‌కే సెట్ అవుతాయని చిరు అన్నారు. అయితే స్టూడియోలు అంత లాభసాటి కాదని, చిరాస్థి మిగిలిపోతుందని అనుకోవడం తప్ప అందులో ఏమీ ఉండదని చిరు అభిప్రాయపడ్డారు. ఇక చిరంజీవి ప్రస్తుతం చేయబోతోన్న బాబీ ప్రాజెక్ట్ గురించి చిన్నగా హింట్ ఇచ్చారట. బాబీ స్టైల్లో మాస్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేలానే సినిమా ఉంటుందట.

ప్రస్తుతం చిరంజీవి నుంచి విశ్వంభర మూవీ ఎప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ మళ్లీ కాస్త వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మే నెలలో పెద్ది వస్తుందని, జూన్ లేదా జూలైలో విశ్వంభర వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Also Read – Rubina Dilaik: ప్రెగ్నెంట్ అని చెప్పిన బుల్లితెర నటి.. నెటిజన్లలో కొత్త అనుమానాలు పుట్టించిన పోస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News