Friday, November 8, 2024
HomeNewsమంచి ఘడియల్లో పాప పుట్టింది - చిరంజీవి

మంచి ఘడియల్లో పాప పుట్టింది – చిరంజీవి

మహాలక్ష్మి రాక తమ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపిందంటూ చిరంజీవి తన సంతోషాన్ని మీడియా కు వ్యక్త పరిచారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసన డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ కూడా హాస్పటల్‌కు వెళ్లడం జరిగింది. కాగా, బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు నెలలు భార్య, కుతురుతో గడపనున్నారు.

- Advertisement -

ఇక అపోలో హాస్పటల్ కు మెగా ఫ్యామిలీ సభ్యులు క్యూ కట్టారు. ఈ క్రమంలో మవనరాలి ని కోడలు ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి హాస్పటల్ కు వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా మీడియా తో చిరంజీవి మాట్లాడుతూ.. మహాలక్ష్మి రాక తమ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా చాలా బాగుందని అంటున్నారని పొంగిపోయారాయన. ఆ ప్రభావం ముందు నుంచీ తమ ఫ్యామిలీలో కనబడుతుందని అన్నారు. రామ్ చరణ్ స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం, వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇలా అన్నీ శుభాలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కావాలని మేము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. ఇది మాకు ఎంతో అపురూపం అనాన్రు చిరంజీవి. చరణ్ కు పాప పుట్టడం చాలా సంతోషంగా ఉంది. మా ఎంతో ఇష్టదైవం అయిన ఆంజనేయుడికి ఇష్టమైన రోజున పాప పుట్టడం ఆనందంగా ఉంది. మా కోసం వచ్చి రామ్ చరణ్ ఉపాసన ను ఆశీర్వదించిన అందరికి, ఆ అభిమానులకు నా కృతజ్ఞతలు అన్నారు.

మరోపక్క సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చరణ్ దంపతులకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు వెల్క్ చెబుతూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. తల్లిదండ్రులైనందుకు మీ ఇద్దరికీ అభినందనలు. కూతురితో గడిపిన ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News