Sunday, December 8, 2024
HomeNewsAll universities VCs met CM Revanth: యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయండి

All universities VCs met CM Revanth: యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయండి

వీసీల భేటీలో రేవంత్

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన అన్ని యూనివర్సిటీ ల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణా రెడ్డి.సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి.

- Advertisement -

వైస్ ఛాన్సలర్లకి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ..యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాలని, కొంత కాలంగా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోందన్నారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని, యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని అన్నారు.

యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని, అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని సీఎం అన్నారు. వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసినట్టు సీఎం వారికి వివరించారు. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం.

మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం ఉంటుందని, యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలని సీఎం అన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం అన్నారు. యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాల పైన ద్రుష్టి సారించాలని, విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఎం వీసీలతో అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News