Wednesday, September 18, 2024
HomeNewsCM Revanth falicitation by Kshatriyas: రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు: సీఎం రేవంత్

CM Revanth falicitation by Kshatriyas: రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు: సీఎం రేవంత్

క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కింది విధంగా మాట్లాడారు..

- Advertisement -

హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది..

రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ,పట్టుదలే కారణం.

సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు..

ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్

కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు గారు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు.

పార్టీ కోసం కష్టపడిన బోసురాజుని రాహుల్ గాంధీ గుర్తించారు.

వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారు.

నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ.

మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించండి..

వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నా..

మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారు..

మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండి..

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీని రాజును నియమించాం..

ఇది క్షత్రియులపై మాకున్న నమ్మకానికి నిదర్శనం..

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో మేం ప్రజా సమస్యలపై కొట్లాడాం..

హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములే

క్షత్రియులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది.

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికి నేను పిలుపునిస్తున్నా..

రండి.. ప్రభుత్వం మీకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది..

క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం మా ప్రభుత్వం అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News